Download Post
5 months
Pushpa2 Day 7 Collections : 1000 కోట్లు దాటేసింది.. బాక్సాఫీస్ ఊచకోతే..కల్కి రికార్డులు బ్రేక్..
Pushpa2 Day 7 Collections : డైరెక్టర్ సుకుమార్ రేంజ్ ఇప్పుడు పూర్తిగా పెరిగిపోయింది.. పుష్ప 2 అతని రికార్డులను బ్రేక్ చేసింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా ఈయన తెరకేక్కించిన బ్లాక్ బాస్టర్ మూవీ పుష్ప 2 పేరే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మోగిపోతుంది..
ఒకటి కాదు, రెండు కాదు కేవలం ఆరు రోజుల్లోనే బాక్సాఫీస్ రికార్డులను కొల్లకొట్టేస్టు 1000 కోట్లను దాటేస్తుంది. అతి తక్కువ సమయంలోనే ట్రిపుల్ ఆర్, బాహుబలి రికార్డులను దాటేసింది. విడుదలైన తొలి వారానికే పరిస్ధితి ఇలా ఉంటే థియేటర్‌లో బిజినెస్ క్లోజ్ చేసే సమయానికి పుష్ప ఇంకెంత రాబడతాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏడో రోజైన మంగళవారం వర్కింగ్ డే కావడంతో చాలా ఏరియాల్లో వసూళ్లు డౌన్ అయ్యాయి. కానీ హిందీ, ఓవర్సీస్‌లో ప్రభంజనం సృస్టించాయి.. ఏడు రోజులకు ఎంత వసూల్ చేసిందో ఒకసారి తెలుసుకుందాం..
హీరో అర్జున్ దెబ్బకు గతంలో సాధించిన సూపర్ స్టార్స్ రికార్డులు బద్ధలవుతున్నాయి. తొలిరోజు విశ్వరూపం చూపించిన పుష్ప రాజ్ .. రెండో రోజు కూడా అదే జోష్ తో కలెక్షన్లను అందుకున్నాడు.. మూడేళ్ల క్రితం వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్ గా పుష్పా రాజ్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే.. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా.. ఫాహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, రావు రమేష్, జగపతిబాబులు కీలక పాత్రల్లో నటించారు. మొదటి నుంచి మూవీ నుంచి విడుదలైన అప్డేట్స్ అన్ని కూడా భారీ హైప్ ను తీసుకురావడంతో ఇందుకు తగినట్లుగానే పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 1000 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. 1200 థియేటర్ల లో రిలీజ్ ఇప్పుడు 1500 కోట్ల క్లబ్ లోకి పరుగులు పెట్టేస్తుంది..
థియేటర్లలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే ఏకంగా రూ.1000 కోట్ల కలెక్షన్లు దాటేసింది. ఇక ఏడో రోజు కూడా అదే జోష్ లో మరో 70 కోట్లు రాబట్టిందని టాక్.. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే ఇంత ఫాస్ట్ గా వెయ్యి కోట్లు ఏ మూవీ కూడా వసూలు చేయలేదు. కేవలం పుష్ప సినిమా మాత్రమే ఇంత భారీగా వసూలు చేయడం అంటే మాటలు కాదు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇప్పటి వరకు ఏ మూవీ కూడా ఇంత ఫాస్ట్ గా వెయ్యి కోట్లు రాబట్టలేదు. ఇప్పటికే చాలా పెద్ద సినిమాల రికార్డులను తుడిచి పెట్టేస్తోంది. గతంలో వెయ్యి కోట్ల మార్క్ ను అందుకున్న అరడజను (ఆర్ఆర్ఆర్, కల్కి, బాహుబలి 2, స్త్రీ 2, జవాన్, కేజీఎఫ్ 2) సినిమాల మార్కును దాటి హిట్ కొట్టింది పుష్ప 2.. అంతేకాదు ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ భారతీయ గ్రాసర్‌గా నిలిచిన పుష్ప 2 ది రూల్ మూవీ అత్యంత వేగంగా రూ. 900 కోట్ల మైలురాయిని దాటిన భారతీయ చిత్రంగా నిలిచింది.. మొత్తానికి పుష్ప రాజ్ కలెక్షన్ల మోత మోగిపోతుంది.. ఇంకా ఎన్ని కోట్లు వసూల్ చేస్తుందో చూడాలి