Download Post
9 months
PEWA AP తిరుపతి జిల్లా PEWA 2026 సం.డైరీ మరియు క్యాలండర్ ఆవిష్కరణ 25-12-2025 గురువారం ఉదయం 10 గంటలకు తిరుపతి శ్రీనివాసపురం లో ఉన్న పద్మశాలి భవన్ (మామిడి కాయల మండి నుండి నందిని బేకరి పక్కన) లో ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు:
1. శ్రీ శ్రీరామ రఘునాథ్ గారు(రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతి)
2. శ్రీ అందె వేంకటేశ్వర రావు గారు (జాయింట్ డైరెక్టర్,స్టేట్ ఆడిట్ మరియు చీఫ్ ఆడిట్ ఆఫీసర్, తిరుమల తిరుపతి దేవస్థానం)
3. డాక్టర్ రామ్మోహన్ రావు గారు (తిరుపతి పద్మశాలి సంఘం అధ్యక్షులు)
PEWA తిరుపతి జిల్లా అధ్యక్షులు పరంధామయ్య గారు , తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి గండికోట వెంకటేశ్వర్లు , మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జింక లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా మహిళా సంఘం ఎంప్లాయిస్ అధ్యక్షులు వాణి గారు ఇతర పెద్దలు, వివిధ శాఖల ఉద్యోగస్తులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా చేయడం జరిగింది.
ఈరోజు PEWA డైరీ మరియు కేలండర్ -2026 ఆవిష్కరణ మహోత్సవమునకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరుపేరునా తిరుపతి జిల్లా PEWA కమిటీ అభినందనలు తెలియజేయడమైనది.
ఇట్లు
PEWA కమిటీ తిరుపతి జిల్లా