Download Post
4 weeks, 1 day
కర్నూలు పద్మశాలీ సంఘం- కార్తీక వనభోజన మహోత్సవం- (09-11-2025- ఆదివారం)-
కర్నూలు నగరం సుంకేసుల రోడ్డులోని మాసా మసీదు పక్కనున్న ఎస్ఎల్ ఎన్ ఫంక్షన్ హాల్లో ఈ నెల 9న ఆదివారం 17fవ పద్మశాలియుల కార్తీక వనభోజన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు పద్మశాలియుల నగర అధ్యక్షుడు కస్తూరి వేమయ్య , ప్రధాన కార్యదర్శి మేడం సుంకన్న , కోశాధికారి గుర్రం శివ ప్రసాద్, తెలిపారు. శుక్రవారం వారు మాట్లాడుతూ ఉదయం 8 గంటలకు ఉసిరి చెట్టుకు పూజ జరుగుతుందని, మహిళలందరు పూజా సామగ్రి తెచ్చుకోవాలని సూచించారు. పూజ అనంతరం అల్పాహారం ఉంటుందని పేర్కొన్నారు. ఆ తరువాత ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కుల పెద్దలకు , త్రి ఐటి, జేఈఈ, నీట్లో ర్యాంకులు సాధించిన పద్మశాలీయుల బిడ్డలకు ఘనంగా సన్మానిస్తామన్నారు. పద్మశాలీయులు అన్ని రంగాల్లో రాణించాలని, అందుకు సంఘం తరుపున ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. మధ్యాహ్నం 1 గంటకు భోజనం తరువాత క్రీడల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. నగరంలోని కుల బాంధవులు అందరూ పాల్గొని కార్తీక వన భోజన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు కస్తూరి వేమయ్య కోరారు. సమావేశంలో పద్మశాలియుల సంఘం నగర సభ్యులు క్యావర్శి గోవిందు, కస్తూరి ప్రసాద్, జేరుబండి హరి ప్రసాద్, శిరసాల లక్ష్మి నారాయణ, కాల్వ సంజీవ్ కుమార్, గోరంట్ల లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.