Download Post
10 months
రూ.కోటి లోన్.. 50 లక్షల సబ్సిడీ
Nov 07, 2024,
రూ.కోటి లోన్.. 50 లక్షల సబ్సిడీ
గొర్రెలు, మేకలు, ఇతర పశుసంపద పెంపకందారులకు గుడ్ న్యూస్. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్‌లో భాగంగా కేంద్రం లోన్‌లు ఇస్తోంది. రూ.కోటి వరకు లోన్ లభిస్తుంది. అర్హులైన వారికి రూ.50 లక్షల వరకు సబ్సిడీ ఉంటుంది. యూనిట్‌లో 500 ఆడ మేకలు/గొర్రెలు, 25 మగవి ఉండాలి. స్థానిక పశువైద్యాధికారి ధ్రువీకరణ పత్రంతో ఈ పథకానికి అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకు https://www.nlm.udyamimitra.in/ వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.
35% సబ్సిడీతో రూ.50 లక్షల లోన్
Nov 07, 2024,
35% సబ్సిడీతో రూ.50 లక్షల లోన్
పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కోరుకునే నిరుద్యోగ యువత కోసం 'ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (PMEGP)' ద్వారా కేంద్ర ప్రభుత్వం లోన్లు అందజేస్తోంది. రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల వారికి 35 శాతం, పట్టణ ప్రాంతాల వారికి 25 శాతం వరకు సబ్సిడీ ఉంటుంది. https://www.kviconline.gov.in/pmegpeportal/jsp/pmegponline.jsp వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.